ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ వారి ముందు మ్యాచ్ లో విజయం సాధించగా., కోల్కతా నైట్ రైడర్స్ వారి హోమ్ గ్రౌండ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుని ఓడించింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ కంటే కోల్కతా నైట్ రైడర్స్ మెరుగ్గా ఉంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్ లలో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇందులో రెండు జట్లు 16 గేమ్ లు గెలిచాయి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. వీరిద్దరి మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ లలో, ఢిల్లీ 3 గెలవగా., కోల్‌కతా 2 గెలిచింది. ఏప్రిల్ 3న జరిగే మ్యాచ్ లో ACA-VDCA క్రికెట్ స్టేడియంలో రెండు జట్లు T20 మ్యాచ్ ఆడడం ఇదే మొదటిసారి. ఇక కోల్‌కతా హోమ్‌గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ ఆడిన 9 మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలవగలిగింది.
Also Read: Bihar : బీహార్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. 58ఇళ్లు బుగ్గిపాలు
ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ఆటగాళ్లు చూస్తే.. డేవిడ్ వార్నర్ , పి షా , ఎంఆర్ మార్ష్ , రిషబ్ పంత్ (సి) టి స్టబ్స్ , అభిషేక్ పోరెల్ , అక్షర్ పటేల్ , ఎ నోర్ట్జే , ముఖేష్ కుమార్ , ఇషాంత్ శర్మ , కెకె అహ్మద్ ప్లేయింగ్ XI లో ఉండొచ్చు. ఆర్‌కె భుయ్ , షాయ్ హోప్ , కుమార్ కుషాగ్రా , యష్ ధుల్ , ఎస్ చికారా , లలిత్ యాదవ్ , సుమిత్ కుమార్ , పి దూబే , జెఎ రిచర్డ్‌సన్ , రసిఖ్ సలామ్ , విక్కీ ఓస్ట్వాల్ , కెఎల్ యాదవ్ , జె ఫ్రేజర్-మెక్‌గర్క్ వీరు మిగితా ఆటగాళ్లుగా ఉన్నారు.
అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ లో PD సాల్ట్ (wk) , SP నరైన్ , VR అయ్యర్ , S అయ్యర్ (C) , రమణదీప్ సింగ్ , RK సింగ్ , AD రస్సెల్ , AS రాయ్ , మిచెల్ స్టార్క్ , H రాణా , వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ XI లో ఉండొచ్చు. అలాగే కెఎస్ భరత్ , ఎన్ రాణా , మనీష్ పాండే , రహ్మానుల్లా గుర్బాజ్ , సాకిబ్ హుస్సేన్ , అంగ్క్రిష్ రఘువంశీ , షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ , వైభవ్ అరోరా , సి సకారియా , డి చమీరా , ముజీబ్ ఉర్ రెహమాన్ , సుయాష్ శర్మ , అల్లా మొహమ్ శర్మ లు మిగితా ఆటగాళ్లుగా ఉన్నారు.