ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు రెండింటిలో గెలిచిన సీఎస్కే.. మరో విజయంపై కన్నేసింది. కాగా.. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడి.. ఈ మ్యాచ్ లో గెలువాలనే కసితో ఉన్నారు.
Read Also: RCB: ఓపెనర్గా అతన్ని పంపించి.. డుప్లెసిస్ను వన్డౌన్ లో దించాలి..
ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈ జరిగే మ్యాచ్ లో కీలక ఆటగాడు మిస్టర్ కూల్, ఎంఎస్ ధోనీకి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో ధోనీ పాల్గొనలేదు. అయితే అతని స్థానంలో తెలుగు క్రికెటర్ అరవెల్లి అవనీశ్ రావు కీపింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో.. ఈరోజు ఢిల్లీతో జరుగనున్న మ్యాచ్ లో అవనీష్ అరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Read Also: Chandrababu: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
యంగ్ క్రికెటర్ అవనీష్ రావు అండర్-19 వరల్డ్ కప్ లో బ్యాటింగ్, కీపింగ్ లో సత్తా చాటారు. అరవెల్లి అవనీష్ రావు స్వస్థలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం.