Rishabh Pant-Shah Rukh: బాగా ఆడావ్.. పంత్‌ను మెచ్చుకున్న షారుక్ ఖాన్! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan Hugs Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సహయజమాని షారుక్ ఖాన్ ఫిదా అయ్యారు. బుధవారం విశాఖలో పంత్ నో-లుక్ షాట్ ఆడినప్పుడు స్టాండ్స్‌లో లేచినిలబడిన చప్పట్లు కొట్టిన షారుక్.. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. బాగా ఆడావ్ అని ప్రశంసలు కురిపించారు. అలానే ఢిల్లీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి గురించి షారుక్ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో రింకూ సింగ్‌తో రిషబ్ పంత్ కూర్చొని మాట్లాడాడు. ఆ సమయంలో షారుక్ ఖాన్ మైదానంలోకి వచ్చారు. షారుక్‌ను చూసిన పంత్ లేచే ప్రయత్నం చేయగా.. ఫర్వాలేదు కూర్చొమని బాలీవుడ్ బాద్‌షా సైగలు చేశారు. అయినా పంత్ లేచి షారుక్ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ఆప్యాయంగా కౌగిలుంచుకున్నారు. పంత్‌తో కాసేపు ముచ్చటించిన షారుక్.. ఢిల్లీ, కోల్‌కతా ఆటగాళ్ల అందరితో కాసేపు మాట్లాడారు. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, గౌతమ్ గంబీర్‌లను బాద్‌షా కౌగిలుంచుకున్నారు. ఎలాంటి అహం లేకుండా షారుక్ హుందాగా ప్రవర్తించడంపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
Also Read: Rishabh Pant Fine: రిషబ్ పంత్‌కు ‘డబుల్’ జరిమానా.. నిషేధం తప్పదా?
2022 చివరలో రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో అతడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలయిన పంత్‌కు శస్త్రచికిత్సలు జరిగాయి. కోలుకున్న పంత్ ఐపీఎల్ 2024తో పునరాగమనం చేసి ఒకప్పటిలా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదనిపించాడు. పంజాబ్ కింగ్స్‌పై 18 రన్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 28 పరుగులు చేసిన అతడు.. చెన్నై సూపర్ కింగ్స్‌పై 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 51 రన్స్ చేశాడు.ఇక కోల్‌కతాపై 25 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!