ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాలరావుతో పాటు ఢిల్లీ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉంటారు. మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.