తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు మళ్లీ ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్చలు ప్రారంభించకపోవడంతో డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభమవుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు.
ఢిల్లీలో రైతుల ఆందోళన మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. సరిహద్దుల దగ్గర మోహరించిన వేలాది మంది రైతులు ఇవాళ ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కేంద్ర ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఏడాదికి పైగా సాగిన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించాయి రైతు సంఘాలు.. ఈ నెల 11న సింఘూ సరిహద్దును రైతులు ఖాళీయనున్నారు.. 11వ తేదీన రైతుల విజయోత్సవాలతో ఆందోళన విరమించాలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, ఆందోళన విరమణ తాత్కాలికమే.. ఇది పూర్తి విరమణ కాదు అంటూ స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ.. అన్ని డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉండడంతో.. ఆందోళన విరమిస్తున్నామని.. జనవరి…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…