Al Falah University: ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న 32 కార్లతో భారీ దాడులు చేయాలని ఉగ్ర డాక్టర్లు పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు, ఈ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న హర్యానా ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఇప్పుడు భద్రతా ఏజెన్సీల చూపు పడింది. ఈ యూనివర్సిటీ నిధులపై దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి…
ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న కుట్ర వీడుతోంది. దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్ల దృశ్యాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chidambaram: ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడిపై తాజాగా మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "దేశీయ ఉగ్రవాదం" అంశాన్ని లేవనెత్తారు. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు కొందరైతే.. దేశంలో తయారవుతున్న స్వదేశీ ఉగ్రవాదులు మరి కొందరని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని వివరించారు. "పహల్గామ్ దాడికి ముందు, తరువాత దేశంలో రెండు రకాల ఉగ్రవాదులు…
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
Delhi Car Blast: ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ మొహమ్మద్‌కు మరో కారు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. సోమవారం ఎర్రకోట వద్ద జరిగిన దాడికి హ్యుందాయ్ ఐ20 కారను ఉపయోగించాడు. కారులో పేలుడు పదార్థాలు నింపి, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇదిలా ఉంటే, అతడికి ఉన్న రెండో కారు కోసం ఢిల్లీ, హర్యానా, యూపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రధాన ప్రాంతాల్లో దాడుల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీ శంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లో దాడులు చేయాలని…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు యావత్తు భారతదేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి తేరుకుంటున్న సమయంలో మరోసారి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోగా.. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట…