ఢిల్లీ పేలుడుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈమేరకు ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ ముజమ్మిల్ షకీల్… డాక్టర్ ఆదిల్ అహ్మద్.. డాక్టర్ షాహీన్.. డాక్టర్ మొహియుద్దీన్ సయీద్.. డాక్టర్ మొహమ్మద్ ఉమర్.. ఈ పేర్లన్నీ వింటే, ఇది ఏదో వైద్య బృందం అని మీరు అనుకోవచ్చు.. కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను… వీరు ఆసుపత్రి సిబ్బంది కాదు.. రోగుల ప్రాణాలను కాపాడే వైద్యులు కాదు.…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు…
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోటకు ఎదురుగా జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడి అని భద్రతా సంస్థలు అంటున్నాయి. కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మద్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలిపాయి. దాడికి కారణమైన…
ఢిల్లీ బ్లాస్ట్‌పై ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పేలుడు మనసు కలిచి వేసిందన్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోడీ.. ఢిల్లీ పేలుడు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు…
139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..! జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి…
High Alert In Hyderabad: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్‌తో ఉపయోగించిన చర్యగా అనుమానిస్తున్నారు. ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన ఈ పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసమవగా, పేలుడు వల్ల ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఎనిమిది మంది మృతి చెందగా, పదుల…
Delhi school blast: ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ఏరియాలోని సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్ వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటన దేశ రాజధానిలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఈ పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు శబ్ధం 2 కి.మీ వరకు వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల పక్కనే ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు…