Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సమన్లు జారీ చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సమన్లు జారీ అయిన తర్వాత పలు విపక్షాలు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఇదిలా ఉంటే సీబీఐ సమన్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చాడు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని