దేశ సరిహద్దుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్డీటీవీ తొలి డిఫెన్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేము అన్ని సమయాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. శాంతి సమయంలో కూడా మేము సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ‘‘భూమి, గగనతలం, సముద్రం నుంచి ఎవరైనా భారత్‌పై దాడి చేస్తే మా బలగాలు ధీటుగా సమాధానమిస్తాయి. మేం ఏ దేశంపైనా దాడి చేయలేదు, ఎవరి భూమిలోనూ…