ఆమె.. మాజీ ప్రపంచ ఛాంపియన్. ఇండియన్ నెంబర్ వన్ బాక్సర్. అర్జున అవార్డు గ్రహీత. ఆమెనే సావీటీ బూరా. దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఈమెకు అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. తన భర్త, అత్తింటి వారు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.