ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా.. రెండో మ్యాచ్ అయితే ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకూ ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఫైరల్‌గా భారత్ 4 పరుగుల తేడాతో రికార్డ్ విజయం నమోదు చేసింది. ఇదే సమయంలో ఓ చెత్త రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు గోల్డెన్ డకౌట్ అవ్వడమే ఆ చెత్త రికార్డ్. దినేశ్ కార్తీక్, అక్షర్…
ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం…
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.…
వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ జట్టును వైట్‌వాష్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇక, టీ-20 సిరీస్‌కు సిద్ధం అవుతోంది.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ-20 సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి భారత్-వెస్టిండీస్ జట్లు.. అయితే, టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ పొట్టి పార్మాట్ సిరీస్‌కు దూరమయ్యారు.. వారి ప్లేస్‌లో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడాలను జట్టులోకి వచ్చినట్టు బీసీసీఐ…
బరోడా ఆల్‌రౌండర్ దీపక్ హుడా, ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. తను ఇచ్చిన ఫిర్యాదుపై సరైన విచారణ చేయకుండా తనపైనే నిషేధం వేటు వేసిన బరోడా క్రికెట్ అసోసియేషన్ తరుపున ఆడలేనట్టు ప్రకటించాడు. ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకున్న దీపక్ హుడా, రాజస్థాన్ జట్టులో చేరబోతున్నాడని సమాచారం.దీంతో మరోసారి బరోడా జట్టుపై, బరోడా కెప్టెన్ కృనాల్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే దీపక్ హుడా కృనాల్ పాండ్యా పైనే జట్టు…