భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర…