వర్షా కాలంలో వరదలతో.. ఎండ కాలం వడ దెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ ప్రాణాలు కోల్పోతున్నది నిరుపేదలే కావడం ఆలోచించాల్సిన విషయంగా మారింది.
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని,…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల…
ప్రపంచంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయినప్పటికీ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. మహమ్మారిని అరికట్టాలి అంతే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారే అధిక సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ తెలిపారు. Read: మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్…
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. 4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. 4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది. అయితే, నిన్నటి డేటా ప్రకారం ఇండియాలో 93,896 కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాల సంఖ్య 3,59,695…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు మూడు లక్షల లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 2,63,533కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 33,53,765 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో ఇండియాలో 4329…