Accident : అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే చెరువు కట్ట…
Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. విజయలక్ష్మి ఆర్కేడ్ భవనం మూడు అంతస్తుల్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో “శుభనందిని చిట్ ఫండ్” బోర్డు తొలగించే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి నాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫాగ్ ద్వారా…
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది.
Rajkot Massive Fire : ఇనుప స్థంభాలు, టిన్ షెడ్, చిన్న గోడలు... టీఆర్పీ గేమ్‌జోన్‌లో ఇదొక్కటే మిగిలి ఉంది. మిగతావన్నీ బూడిద పాలయ్యాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది చిన్నారులు సహా 28 మంది మరణించారు.
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.
అమెరికాలో (America) ఇటీవల వరుసగా జరిగిన ఘటనల్లో ఐదుగురు భారత విద్యార్థుల (Indian Students ) మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది
Libya Floods: డేవియల్ తుపాన్ ఉత్తర ఆఫ్రికా దేశం లిబియాను అతలాకుతలం చేసింది. తుపాను, వరదల కారణంగా ఏకంగా 20,000 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన…
కోవిడ్ తరువాత జరిగిన మరణాలపై అధ్యయనం చేయాలనిఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు అధ్యయనాలను చేపట్టాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది.