ICMR Research: కోవిడ్ తరువాత జరిగిన మరణాలపై అధ్యయనం చేయాలనిఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు అధ్యయనాలను చేపట్టాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. కోవిడ్ మూలంగా చనిపోయిన వారు కాకుండా.. కోవిడ్ మొత్తం ముగిసి పోయిన తరువత మరణించిన వారి పోస్టు మార్టమ్ రిపోర్టులను పరిశీలించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. భారత్ తో పాటు పలు దేశాల్ని అతలా కుతలం చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం చాలా వరకు తగ్గినా పోస్టు కోవిడ్ మరణాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆకస్మిక మరణాలు ఇండియాతోపాటు పలు దేశాల్ని కలవరపెడుతున్నాయి. గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న యువతలో ఆకస్మికంగా మరణాలు చోటు చేసుకోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. దేశంలో ఇలాంటి కేసులు కూడా పెరుగుతుండటంతో కేంద్రం దీనిపై దృష్టిసారించింది. ఇందుకు సంబంధించి ఐసీఎంఆర్ భారత్ లో కోవిడ్ తర్వాత యువకుల ఆకస్మిక మరణాలకు కారణాలను తెలుసుకోవడం కోసం రెండు అధ్యయనాలను నిర్వహించాలని నిర్ణయించింది.
Read also: PM Modi: డిజిటల్ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుంది
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల మద్య వయస్సు గల వ్యక్తుల్లో కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత చోటు చేసుకుంటున్న మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ సదస్సులో పాల్గొన్న ఆయన ఎలాంటి కారణాలు లేకుండా మరణాలు పెరుగుతున్నాయని అందుకే ఈ అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎటువంటి కారణాలు లేకుండా దేశంలోని యువతలో చోటు చేసుకుంటున్న మరణాలపై ఐసీఎంఆర్ రెండు అధ్యయనాలు చేయనుందని.. ఈ అధ్యయనాలు కోవిడ్ -19 వ్యాప్తి పరిణామాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఇందుఉ కారణాలు తెలిస్తే రాబోయే కాలంలో జరిగే మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని ఐసీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ఇతర తీవ్ర వ్యాధులు ఏమీ లేకున్నప్పటికీ యువతలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపైనే ఈ అధ్యయనాలు సాగుతాయని వారు స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో పోస్టు కోవిడ్‌తో మరణించిన 50 మృతదేహాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా 100 మృతదేహాలపై ఈ అధ్యయనాలు చేయాలని ఐసీఎంఆర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా పోస్టుమార్టంల రిపోర్ట్ లను, కోవిడ్ తర్వాత పరిస్ధితులతో పోల్చి చూడటం ద్వారా కారణాలు తెలుసుకోనున్నట్టు ఐసీఎంఆర్ చెబుతోంది. మరొక అధ్యయనంలో 18 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఆకస్మిక మరణాల డేటాను తీసుకుని.. వారు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏ జరిగిందో ఐసీఎంఆర్ నిపుణులు తెలుసుకుంటున్నారు. రిపోర్టుల ఆధారంగా కారణాలను పరిశీలించనున్నారు.