Dhanush – SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వడ చెన్నై 2’. వెట్రిమారన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘వడ చెన్నై’ గ్యాంగ్‌స్టర్ కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా ముగింపులోనే పార్ట్-2 ఉంటుందని ప్రకటించిన మేకర్స్. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇప్పుడు ‘వడ చెన్నై 2’ ప్రొడక్షన్ వర్క్స్. త్వరలోనే ప్రారంభిస్తాం అని మూవీ టీం కన్ఫామ్ చేసింది. అలాగే అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాన్ని ఒక మల్టీ-పార్ట్ ఫ్రాంచైజీగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రీక్వెల్తో పాటు సీక్వెల్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు దర్శకుడు సెల్వరాఘవన్‌తో ధనుష్ చేయాల్సిన కల్ట్ ప్రాజెక్ట్‌లు ‘ఆయిరతిల్ ఒరువన్ 2’, ‘పుదుపేట్టై 2’ చిత్రాలు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ధనుష్ సినిమాల లైనప్ ఒకెత్తయితే యంగ్ హీరో శివకార్తికేయన్ నుంచి వస్తున్న అప్డేట్ మరో రేంజ్లో ఉంది. మూడేళ్ల క్రితం మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ ఫాంటసీ డ్రామా ‘మావీరన్’. అదితి శంకర్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో అలరించిన ఈ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపుగా ‘మావీరన్ 2’ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ షూటింగ్‌ను 2027చివర్లో ప్లాన్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికొచ్చింది. ఈ సీక్వెల్‌కు మేకర్స్ ఇప్పటికే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. మాస్ గ్యాంగ్‌స్టర్ కథల నుంచి ఫాంటసీ యాక్షన్ డ్రామాల వరకు కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వరుస సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. మరి ధనుష్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్ లోకి తీసుకెళ్లే ‘వడ చెన్నై 2’ కోసం ఎదురుచూస్తున్నారో.. లేక శివకార్తికేయన్ ‘మావీరన్ 2’ కోసం ఆడయెన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!