Amazon Special delivery station in Andhra Pradesh: అమేజాన్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. ఈ కంపెనీకి దేశం మొత్తమ్మీద ఏడు ఉమెన్ డెలివరీ కేంద్రాలు ఉండగా ఇది ఏపీలో రెండోది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ సెంటర్‌లో 50 మంది మహిళలు పనిచేస్తారు. అమేజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్నర్‌తో కలిసి ఈ స్టేషన్‌ను ఏర్పాటుచేసింది.