కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్‌లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని నయాపురా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వ్యక్తి మృతికి గల…
హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు.…
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ…
తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన చిన్ననాటి స్నేహితురాలు కలలోకి వచ్చి తన దగ్గరికి రమ్మంటుందని మృతురాలు తన సోదరుడికి చెప్పి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 3 సంవత్సరాల క్రితం మరణించిన స్నేహితుడు కలలోకి వస్తున్నాడని భయపడుకుంటూ చెప్పి.. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిల్షాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Guntur : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ రైతును హత్య చేసి మృతదేహాన్ని పొలంలో పడేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మృతుడి చేతి గోళ్లు మాయమయ్యాయి.
తమిళనాడులో (Tamil Nadu) ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో (firecracker blast) భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. పలు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు…