ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతదేహాలు ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేర్చారు.. ఒక్కసారిగా ఆ మృతదేహాలను చూసి బోరున విలపించారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయన్ని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఓదార్చారు..
OYO: ఓయో హోటల్‌లో రెండు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఓ యువకుడు మహిళను హోటల్‌కు పిలిచి హత్య చేసి తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
బావిలో ఓ కుటుంబం మొత్తం శవమై తేలింది. పెళ్ళీడుకు వచ్చిన కూతురితో సహా దంపతులు మృతి చెంది కనిపించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ కుటుంబంతో కలిసి జీవించేవారు. ఏం జరిగిందో తెలీదుగానీ కుటుంబంతో సహా వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు.
అంతరిక్షంలోకి వెళ్లడమే పెద్ద సాహసం అనే చెప్పాలి.. ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకున్న వారే వెళ్తారు.. అంతరిక్షంలో రహస్యాలను చేధించేందుకు గానూ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు అంతరిక్ష ప్రయాణాలు చేయడం సాధారణమైపోయింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయాణాలు చాలా అరుదుగా ఉండేవి. రానురాను ఈ అంతరిక్ష ప్రయాణాల పరంపర పెరుగుతోంది. 60ఏళ్ళ క్రితం అంతరిక్ష పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 60ఏళ్ళ కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా 20మంది మరణించారు..…
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు.