కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతున్నది. అయితే, దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం, థర్డ్ వేవ్ చిన్నారిపై ఎఫెక్ట్ చూపుతుందని నిపుణులు హెచ్చరించడంతో చిన్నారుల్లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం భారత్ బైయోటెక్ కంపెనీ చిన్నారుల వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ కోసం డిసీజీఐ అనుమతి ఇచ్చింది. 525 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించబోతున్నారు. 2-18 ఏళ్ల వయసు వారిపై సమర్ధవంతంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని భారత్ బయోటెక్ ఫార్మా చెప్తున్నది.