ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఎటాక్ చేశారు. రైతుల అప్పులు ముఖ్యమా, దావోస్ డప్పుల ముఖ్యమా అని ప్రశ్నించారు. రైతు భరోసా చిల్లర పంచాయతీనా ముఖ్యమంత్రి గారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్నారు. దావోస్ పర్యటన తర్వాత ఈరోజు అర్ధరాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు. అనంతరం.. సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలన్నారు లోకేష్.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సు 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. దావోస్‌లో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజూ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల…
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. మొదటి రోజు స్విట్జర్లాండ్‌లో భారత్ హైకమిషనర్‌తో భేటీ. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. ఎన్నారైలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం బృందం. దావోస్ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు. ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. సింగపూర్ నుంచి దావోస్‌కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం…