టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతున్నారని.. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ ఫ్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం…
తెలంగాణ రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగాచేస్తున్నాయని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) సీఎం కేసీఆర్‌వి వికృత చేష్టలు. క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కేసీఆర్ ది దొంగ దీక్ష.. . రైతులను దగా చేసే కుట్ర అన్నారు. రంగస్థలం సినిమాలో జగపతి బాబు లెక్క… కేసీఆర్ తయారయ్యారన్నారు శ్రవణ్. బీజేపీ..టీఆర్‌ఎస్‌లు డ్రామాలు చేస్తున్నాయి. ఇద్దరూ ధర్నాలు చేస్తే… రైతులను ఆదుకునేది ఎవరు .? ఉప్పుడు బియ్యం ఇవ్వం అని చెప్పింది…
తెలంగాణలో యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా వుంటే 80 వేల ఉద్యోగాలే భర్తీచేయడం ఏంటని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి విపక్షాలు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన రీతిలో విమర్శలు చేస్తున్నారు. 2004 – 14 వరకు ఉద్యమం లో యువత పెద్దన్న పాత్ర. 2014 – 22 వరకు ఉద్యోగాల కోసం యువత ఆశగా చూసారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో నిరుద్యోగులు, యువత వ్యతిరేకంగా…
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు.. మరి మిగతా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ఇది 40లక్షల కుటుంబాల సమస్య. తెలంగాణ లో నిరుద్యోగ ఎమర్జెన్సీని ప్రకటించండి. 90 వేల ఉద్యోగాలు ఇచ్చి 39లక్షల మంది నోట్లో మట్టి కొడుతున్నారు. నిరుద్యోగం పై లోతైన చర్చ జరగాలి…అఖిలపక్షంతో చర్చించాలన్నారు. నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు…
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్…
సీఎం కేసీఆర్, జగన్‌లపై ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. జగన్, కేసీఆర్ లు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వారిద్దరి నటన రావుగోపాల్ రావు.. అమ్రిష్ పురి నటనను మించి పోయిందని చురకలు అంటించారు. జల జగడం.. ఓ పెద్ద డ్రామా అని.. రాయలసీమకు వెళ్ళినప్పుడు కేసీఆర్ రతనాల సీమ చేస్తానని చెప్పారని..జగన్ ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపాడని ఆరోపణలు చేశారు. read aslo : ఏపీ కరోనా…
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భూముల అమ్మకం ఏంటీ.. కేసీఆర్..? ఆదాయం కోసం నిన్న సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టారని మండిపడ్డారు. ఎకానమీ పెంపుపై నిపుణులతో సమావేశం పెట్టాలని..బసవన్నలతో కాదని నిప్పులు చెరిగారు. టీఆరెస్ సర్కార్ తప్పుడు పనులు చేస్తుందని..ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టికల్ 20 ప్రకారం గవర్నమెంట్ ట్రస్టీగానే పనిచేయాలని.. నన్ను తిట్టిన, చంపిన ప్రజల పక్షాన…
ఈటల బిజేపిలో చేరడంపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల దాడిని తప్పించుకోవడానికే ఈటల ఢిల్లీ వెళ్లారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ఈటల పై పోలీసు, రెవెన్యూ అధికారులతో ఒత్తిడి పెంచారని.. ఒత్తిడి తప్పించుకోవడానికి ఈటల ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ ఆధిపత్యం కోసం ఈటలతో పాటు.. ఆయన భార్య జమున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీకాదు, ఫక్తు ఫాల్తూ పార్టీగా మారిందని…