టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతున్నారని.. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ ఫ్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ద్వారా కేసీఆర్ మోసాలను ఎండగడుతాం అని అన్నారు.
కౌలు రైతులు దుర్భర జీవితాన్ని గుడపుతున్నారని… ప్రభుత్వ వారిని గుర్తించడం లేదని అన్నారు. వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని.. రైతు కూలీలకు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. పోడు భూములను హరితహారం పేరులో ప్రభుత్వం గుంజుకుని హక్కు పత్రాలు ఇవ్వలేని ఆరోపించారు. ప్రతీ గిరిజన రైతుకు,పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి వల్ల భూమి ఉన్న రైతు బిక్షగాడుగా మారాడని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి ఎందుకు మీటింగ్ పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు రుణాలు ఇవ్వకుండా ఎగవేసి బడాబాబులకు రుణాలు ఇస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న లక్షా 30 వేల కోట్లు ఎగవేసేలా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పంటలను నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని దాసోజు శ్రవణ్ విమర్శించారు.