సీఎం కేసీఆర్, జగన్‌లపై ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. జగన్, కేసీఆర్ లు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వారిద్దరి నటన రావుగోపాల్ రావు.. అమ్రిష్ పురి నటనను మించి పోయిందని చురకలు అంటించారు. జల జగడం.. ఓ పెద్ద డ్రామా అని.. రాయలసీమకు వెళ్ళినప్పుడు కేసీఆర్ రతనాల సీమ చేస్తానని చెప్పారని..జగన్ ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపాడని ఆరోపణలు చేశారు.
read aslo : ఏపీ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు
అంతేకాదు.. విజయసాయి రెడ్డి ఏకంగా కేసీఆర్ కాళ్ళు మొక్కాడని..ఇవన్నీ ప్రజలు మరిచిపో లేదన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని…ఆంధ్ర ప్రభుత్వం జీఓ ఇచ్చి రెండు సంవత్సరాలు పైన అయ్యిందని గుర్తు చేశారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. జగన్, కేసీఆర్ ల డ్రామాలకు ప్రజలు మోసపోవద్దని పేర్కొన్నారు.