Vivekananda Goud: ఆయన లాగా బ్యాగులు మోసి రాజకీయాల్లో పైకి రాలేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivekananda Goud: బీసీ రిజర్వేషన్ల అంశం, సోనియా లేఖపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పట్నం వివేకానంద, బీఆర్ఎస్ నేత క్యామ్ మల్లేశ్ బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రేవంత్ వ్యాఖ్యలను ఘాటుగా తప్పుబట్టారు. ఈ సమావేశంలో భాగంగా.. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాసిన లేఖను తనకు ఆస్కార్ లాంటిదని రేవంత్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారన్నారు. అందులో ఆమె కేవలం పవర్ పాయింట్ సమావేశానికి తాను హాజరు కాలేనన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ గాంధీ కుటుంబానికి చిరునవ్వులు పండించే ప్రయత్నంలో ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
Jagdeep Dhankhar: ప్రతిపక్షం షాకింగ్ నిర్ణయం.. ధన్‌ఖర్‌కు వీడ్కోలు విందు ఏర్పాటు!
సీఎం రేవంత్ అసత్యాలతో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే, లేకపోతే భాస్కర్ అవార్డు అయినా ఇవ్వొచ్చు అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. సీఎం రేవంత్ లాగా బ్యాగులు మోసి రాజకీయాల్లో పైకి రాలేదని, ప్రజాసేవతోనే మేము రాజకీయాల్లోకి వచ్చాం అని అన్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
Prasanna Kumar Reddy: నేను కాదు.. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డే నాపై ఆరోపణలు చేశారు!
ఇక బీఆర్ఎస్ నేత క్యామ్ మల్లేశ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అబద్ధాల ద్వారా అధికారంలోకి వచ్చారు. అటువంటి వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బీసీలను, సామాజిక గౌరవాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, చేపలు పట్టేవారిని మంత్రి చేశాను, బట్టలు ఉతికేవారిని ఎమ్మెల్యే చేశానన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వ్యక్తిత్వంపై కాంగ్రెస్ నాయకులు దూషణలు చేస్తున్నారని మల్లేశ్ మండిపడ్డారు. కేటీఆర్ హీరోయిన్లకు ఫోన్ చేస్తుంటే, మీరు డోర్ దగ్గర కావలిచేస్తున్నారా..? అంటూ కౌంటర్ వేశారు. అలాగే పార్టీ మారిన నేతలపై కూడా మల్లేశ్ తీవ్రంగా స్పందిస్తూ.. అలాంటి పిచ్చికుక్కలను తొండలెక్కించి కొట్టాలి.. రేవంత్ కూడా భవిష్యత్తులో వారిపై వాత పెడతాడన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!