తెలుగు సినీ పరిశ్రమలో వేతన పెంపు డిమాండ్ నేపథ్యంలో, నిర్మాత సీ కళ్యాణ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు నిర్వహించిన సమావేశం పరిశ్రమలో కీలక పరిణామంగా మారింది. 30% వేతన పెంపు డిమాండ్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించడం, ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన కొందరిపై చర్యలు తీసుకోవడం వంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ఉద్రిక్తతలను పెంచాయి. ఈ సమావేశంలో సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. కార్మికులు 30% వేతన పెంపు కోసం…
కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, “మా అమ్మగారికి సంతానం లేదు. రెండు మూడు సార్లు గర్భం నిలవకపోవడం వల్ల ఆవిడకు పుట్టుకతో రెండు చెవులు లేవు. నాన్నగారేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన ఒక నాలుగు కిలోమీటర్లు కొలనులో నడిచి వెళ్లి, ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు ఫారెస్ట్‌లో నడిచి వెళ్లాలి. ఆ తర్వాత నాలుగైదు కిలోమీటర్ల కొండ ఎక్కాలి. అక్కడ లింగాకారంలో ఈశ్వరుడు. శ్రీకాళహస్తిలో ఎలా…
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదిన వేడుకలను తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఘనంగా నిర్వహించింది. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో…
తెలుగు చిత్రసీమలో ‘స్వర్ణోత్సవాలు,వజ్రోత్సవాలు’ అన్నవి ఏ నాటి నుంచో ఉన్నప్పటికీ వాటికి క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వారిద్దరూ గురుశిష్యులు కావడం విశేషం! వారే దర్శకరత్న దాసరి నారాయణరావు, ఆయన శిష్యకోటిలో ‘గురువుకు తగ్గ శిష్యుడు’ అనిపించుకున్న కోడి రామకృష్ణ. దాసరి తన తొలి చిత్రం ‘తాత-మనవడు’తో ‘స్వర్ణోత్సవం’ చూశారు. శిష్యుడు కోడిరామకృష్ణ కూడా తన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’తో ఏకంగా 510 రోజుల చిత్రాన్ని చూపించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్…
Posani Krishna Murali Comments on Dasari Narayana Rao: ఏపీతో పాటు తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ సీజన్ కావడంతో ఎన్టీవీ ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తాజాగా ఈరోజు నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి ఏపీ వైసీపీ నేత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక…
Story behind Photo in Tollywood: ‘చిరంజీవి’ మెగాస్టార్ గా వరుస కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్న సమయంలో ఆయనకు చిన్న అసంతృప్తి ఉండేది. ఎందుకో మూస పద్దతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేయడానికి అందులో మూడు పాత్రలలో నటించేందుకు ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి ‘చిరంజీవి’ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు…
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ అంటే అప్పట్లో జనానికి భలే క్రేజ్! ఏయన్నార్, దాసరి కలయికలో ఓ డజన్ సినిమాలు వెలుగు చూశాక వచ్చిన చిత్రం ‘బహుదూరపు బాటసారి’. ఈ సినిమాకు ముందు దాసరి దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం” వంటి హిట్ మూవీస్ జనాన్ని భలేగా అలరించాయి. వాటిలో ‘ప్రేమాభిషేకం’ ప్లాటినమ్ జూబ్లీ కూడా చూసింది. దాంతో దాసరి-అక్కినేని కాంబో అనగానే జనానికి సదరు చిత్రంపై…