Story behind Photo in Tollywood: ‘చిరంజీవి’ మెగాస్టార్ గా వరుస కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ వెళ్తున్న సమయంలో ఆయనకు చిన్న అసంతృప్తి ఉండేది. ఎందుకో మూస పద్దతిలో సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం ఆయనకు నచ్చలేదు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా చేయడానికి అందులో మూడు పాత్రలలో నటించేందుకు ప్లాన్ చేశారు చిరు. మొదటిసారి ‘చిరంజీవి’ మూడు గెటప్స్ లో కనిపిస్తున్నారు అనగానే ‘ముగ్గురు మొనగాళ్లు’ పై భారీ అంచనాలు క్రియేట్ అవడంతో 1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా నగ్మా, రమ్యకృష్ణ, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Pooja Hegde: ఎయిర్ పోర్టులో బుట్టబొమ్మ హాట్ ట్రీట్.. తట్టుకోగలమా?
ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పక్కనే మరో షూట్ లో ఉన్న ఎన్టీఆర్, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు, నిర్మాత రామానాయుడు, హీరో నాగార్జున కలిశారు. వారంతా ఒకే ఫ్రేములో ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. రంగనాథ్, శ్రీవిద్య దంపతులు తమ కుమారులు పృథ్వీ, (చిరంజీవి త్రిపాత్రాభినయంలతో ఒకరు)ఒక గ్రామంలో నివసిస్తుంటారు. ఒక కేసు విషయంలో రంగనాథ్ ను శరత్ సక్సేనా చంపేస్తాడు, . గర్భవతి అయిన శ్రీవిద్య పారిపోతూ ఆ సమయంలో పృథ్వీ నుంచి దూరమవుతుంది, గూండాల నుంచి తప్పించుకునే టప్పుడు తన కొడుకు చనిపోయాడు అని అనుకుంటుంది. ఒక ఆలయంలోకి వెళ్లి అక్కడ విక్రమ్, దత్తాత్రేయ అనే కవలలకు జన్మనిస్తుంది. సంతానం లేని పూజారి ఒక కొడుకుని దత్తత తీసుకుంటే శ్రీవిద్య పెంచిన విక్రమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అవుతాడు. దత్తాత్రేయ డ్యాన్స్ టీచర్ అవుతాడు, అయితే ఈ ముగ్గురు సోదరులు ఒకరినొకరు, తల్లిని ఎలా కలిశారు, తమ తండ్రి చావుకు ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు అనేది మిగతా కథ.