హైదరాబాద్: స్వర్గీయ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం దాసరి కుమారులు దాసరి అరుణ్, దాసరి ప్రభు రూ.2.11 కోట్లు తీసుకున్నారని… ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు అనే బాధితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై బుధవారం విచారించిన సిటీ సివిల్…
(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు…
(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు) నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల…
(ఆగస్టు 30తో ‘మామగారు’కు 30 ఏళ్ళు పూర్తి) నటునిగానూ దర్శకరత్న దాసరి నారాయణరావు విశ్వరూపం చూపించిన చిత్రం ‘మామగారు’. తమిళ చిత్రం ‘నాన్ పుడిచ మాప్పిళ్ళై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రీమేక్ మూవీస్ రూపొందించడంలో మేటి అనిపించుకున్నఎడిటర్ మోహన్ ఈ చిత్రాన్ని ఎమ్.ఎమ్.మూవీ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఆ తరువాత మరో ఐదేళ్ళకు ఎడిటర్ మోహన్ నిర్మించిన రీమేక్ ‘హిట్లర్’లోనూ దాసరి కీలక పాత్ర పోషించగా, ఆ చిత్రానికి కూడా…
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కొడుకులపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే… 2012లో దాసరి నారాయణరావు రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకుండానే 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు కన్నుమూశారు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు ఈ విషయాన్ని దాసరి కొడుకుల వద్ద ప్రస్తావించారు. Read Also : శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ పెద్ద మనుషుల సమక్షంలో ఆయన కుమారులు…
(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు) విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య…
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లలో బయోపిక్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఆయా రంగాల్లో రాణించిన ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక టాలీవుడ్ దర్శక దిగ్గజం, దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన బయోపిక్ పై ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో దాసరి బయోపిక్ నిర్మించేందుకు నిర్మాత తాడివాక…