Posani Krishna Murali Comments on Dasari Narayana Rao: ఏపీతో పాటు తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ సీజన్ కావడంతో ఎన్టీవీ ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తాజాగా ఈరోజు నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి ఏపీ వైసీపీ నేత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు. ఈ సందర్భంగానే దాసరి నారాయణరావు ఉదంతాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో దాసరి నారాయణరావుకి మద్దతుగా ఆయన ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసరి నారాయణరావు గారు అప్పుల పాలైపోయి ఇంటికి అద్దె కూడా కట్టలేని స్టేజిలో ఉన్నప్పుడు ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అన్నారు.
Rashmi: అనసూయపై రష్మీ హాట్ కామెంట్స్.. ఆమె నుంచి లాగేసుకున్నానంటూ!
పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తే రెండు లక్షల ఖర్చు అవుతుందని చిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి 50 వేల రూపాయలతో ఆపరేషన్ పూర్తి చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తాను అప్పుడు రచయితగా ఉన్నానని ఒక ఫిలిం రిపోర్టర్ ఈ విషయం తన దృష్టికి తీసుకు వస్తే ఏం చేయాలి అని ఆలోచించి సినీ పరిశ్రమ నుంచి ఎవరూ సాయం చేయలేదని తెలిసి, అందరితోపాటు ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో లక్ష రూపాయల ఖర్చు పెట్టి ప్రముఖ పేపర్ లో ఫుల్ పేజీ యాడ్ చేయించానని అన్నారు. ఈ విషయం తెలిసి దాసరి నారాయణరావు నన్ను పిలిపించుకుని దండం పెట్టారని అలా దండం పెడితే వెంటనే వెళ్ళిపోతానని అన్నానని గుర్తు చేసుకున్నారు. ఆయన్ని చూసి వచ్చేస్తున్న సమయంలో అప్పుడే కవర్లో పెట్టి తెచ్చిన డబ్బు ఆ హాస్పిటల్ దిండు కింద పెట్టి వచ్చానని పోసాని కృష్ణ మురళి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైయస్ కు వ్యతిరేకంగా యాడ్ వేయించారు కదా అని ప్రశ్నించగా దానికి అనుబంధంగా ఆయన ఈ సమాధానం చెప్పుకొచ్చారు.