Maoists Surrender : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు…
Maoists: కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.
Dantewada Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఒక మహిళా మావోయిస్టుతో పాటు చాలా మంది మావోయిస్టులు మరణించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్ట్ రేణుక అలియాస్ బాను మరణించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా జిల్లా రిజర్వ్…
Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం నక్సలైట్లు , భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 25 లక్షల రివార్డ్ కలిగిన టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.
Maoists Funerals: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజమాద్ ఏరియాలో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు సానుభూతిపరులు అంత్యక్రియలు నిర్వహించారు. దంతేవాడ , నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని తుల్ తులి అనే చోట ఈ నెల నాలుగో తేదీన మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 35 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన జారీ చేసింది. Read Also: Uttarpradesh : ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాము.. దాంతోనే ఆస్పత్రికి వచ్చిన…
Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్-దంతేవాడ సరిహద్దు ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఎన్‌కైంటర్ ప్రారంభమైంది. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మరో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు.
దండకారణ్యలో ఉన్నత స్థాయి టేకు చెట్లు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా చాలా పొడవుగా ఉంటాయి. దండకారణ్యంలో వసంతకాలం తర్వాత వచ్చే శరదృతువు మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో నక్సలైట్ల సంఘటనలు ఒక్కసారిగా పెరుగుతాయి.
11 Cops Killed In Blast By Maoists In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మావోలు పోలీసులు లక్ష్యంగా భారీ పేలుడుకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లాలో అరాన్పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో మొత్తం 11 మంది పోలీసులు చనిపోయినట్లు సమాచారం.