Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు
- దగ్గర పడుతున్న డెడ్‌లైన్
- 63 మంది మావోలు లొంగుబాటు
- ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ పరంపర కొత్త ఏడాదిలో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Silver Rates: మరోసారి సిల్వర్ హడల్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై మొత్తం రూ. 1.19 కోట్ల బహుమతి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఏడుగురిలో ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానంతో ఆదుకుంటామన్నారు. వీరంతా రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని చెప్పారు. 18 మంది మహిళలు సహా 63 మంది మావోలు.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో 1,500 మందికి పైగా మావోలు లొంగిపోయారని పోలీసులు చెప్పారు.
ఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, విశ్వాసం, అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించారని కొనియాడారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!