Danish Kaneria: పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్లతో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మ్యాచ్ నుండి వైదొలిగినందుకు మాజీ పాకిస్తాన్ బౌలర్ డానిష్ కనేరియా భారత క్రికెటర్లను విమర్శించారు. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ మాజీ స్పిన్నర్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మీకు అనుకూలమైనప్పుడు దేశభక్తిని ఉపయోగించడం మానేయండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఖరారైన తర్వాత భారత క్రికెటర్లపై విమర్శలు గుప్పించారు.
India: పాకిస్తాన్‌లో ఉన్న భారతీయలు వెంటనే దేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
ఈ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాక్ తరుపున ఆడిన అతికొద్ది మంది హిందూ క్రికెటర్లలో ఒకరైన దానిష్ కనేరియా స్పందించారు. ‘‘పహల్గామ్ దాడిని క్రూరమైన దాడి’’గా ఖండించారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి బెంగాల్, కాశ్మీర్ వరకు అదే మనస్తత్వం హిందువుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ లౌకికవాదులు, న్యాయవ్యవస్థ దాడి చేసిన వారిని అణిచివేయబడిన మైనారిటీగా ముద్రవేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన పోస్టులో భర్తను కోల్పోయిన మహిళ,…
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ అవసరమని.. అలాంటి వాడైతేనే జట్టులోని ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ సమస్యలను పరిష్కరించగలడని డానిష్ కనేరియా తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. పాకిస్తాన్ టీంకు వైట్-బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను, టెస్ట్ టీమ్ కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని నియమించారు.
Danish Kaneria Slams Pakistan Team after T20 World Cup 2024 Exit: టీ20 ప్రపంచకప్ 2024లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. పొట్టి కప్ కోసం పీసీబీ సెలెక్టర్లు చెత్త జట్టును ఎంపిక చేశారన్నాడు. పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది సిగ్గుచేటని, ఇలాంటి రోజు వస్తుందని తాను ఊహించలేదన్నాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లు పసికూన జట్లు…
Danish Kaneria React on Rinku Singh’s T20 World Cup 2024 Snub: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. రింకూ 15 మంది జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో రింకును తీసుకుంటే బాగుండేదన్నాడు. శివమ్ దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం అని…