Danish Kaneria React on Rinku Singh’s T20 World Cup 2024 Snub: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్‌ను టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు ఇవ్వకపోవడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. రింకూ 15 మంది జట్టులో లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. పెద్దగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యా స్థానంలో రింకును తీసుకుంటే బాగుండేదన్నాడు. శివమ్ దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం అని కనేరియా పేర్కొన్నాడు. భారత జట్టును ఏప్రిల్ 30న బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలువురు మాజీలు జట్టుపై స్పీడిస్తున్నారు.
స్పోర్ట్స్ నౌలో డానిష్ కనేరియా మాట్లాడుతూ… ‘నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడంలో టీమిండియాకు మంచి పేరు ఉంది. ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, అంగ్క్రిష్ రఘువంశీ ఇందుకు మంచి ఉదాహరణలు. మయాంక్ యాదవ్ తన పేస్‌తో, అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. చాలా మంది కుర్రాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు. రింకు సింగ్ కూడా అలానే వచ్చాడు. రింకును టీ20 ప్రపంచకప్ 2024లో చూస్తానని ఆశించా. కానీ అది ఇప్పుడు కుదరదు’ అని అన్నాడు.
Also Read: Mumbai Indians: ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ లేవు కాబట్టి.. కనీసం ఆ పనైనా చేయండి!
‘చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్న శివమ్ దూబే టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కించుకున్నాడు. దూబెను తీసుకోవడం మంచి నిర్ణయం. దూబే సహా రింకు సింగ్ కూడా ఉంటే.. లోయర్ ఆర్డర్‌లో భారత జట్టుకు బలంగా ఉండేవారు. ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా నిలకడగా రాణించడం లేదు. ఇటీవల అతడి ఫామ్ కూడా గొప్పగా ఏమీ లేదు. పాండ్యా బదులుగా.. రింకును తీసుకుంటే బాగుండేది’ అని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.