ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బిజీగా వుంటారు. జగన్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్ళేందుకు వారు ప్రయత్నిస్తూనే వుంటారు. అందునా, రాబోయే రోజుల్లో మరింత విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాత్రం అన్నిటినీ పక్కన పెట్టారు. డ్యాన్స్ తో చిందేశారు. ఓ ప్రైవేట్ పార్టీలో స్నేహితులు, పార్టీ సన్నిహితులతో కలసి చిందులు వేసిన ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతోంది. మంత్రి పదవులు కోసం ఎమ్మెల్యేలు…
ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధంతో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశంగా ఉండకూడదు అని రష్యా షరతు విధించగా, దానికి ఉక్రెయిన్ తిరస్కరించడం, నాటో కూడా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడంతో యుద్ధం అనివార్యమైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెస్కీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. Read: Smartphones:…
పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. నెటిజన్లు ఈ సాంగ్‌కు అనేక పేరడీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌కు వధూవరులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. రోనక్ షిండే, ప్రాచీమోర్ అనే నూతన వధూవరులు ఊ…
పెళ్లిళ్లు అంటే ఎలాంటి హడావుడి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు దావత్ చేసుకుంటారు. అదేవిధంగా డ్యాన్సులు, హంగామా ఉంటుంది. ఆ తంతు జరిగే సమయంలో చాలా పెళ్లిళ్లలో గొడవలు జరుగుతుంటాయి. పెళ్లి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో ఈ తంతు కారణంగా అదనంగా బోలెడు ఖర్చులు అవుతుండటంతో రాజస్తాన్‌లోని గోడీ తేజ్‌పూర్ అనే గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లలో దావత్, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. గ్రామంలోని మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లు ఈ…
మనసు ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తే… వయసుతో పెద్దగా పని ఉండదు. ఏ వయసులోనైనా సరే హ్యాపీగా బతికేయవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. దీనిని ఎంతో మంది నిరూపించారు. ఇప్పుడు హర్యానాకు చెందిన ఓ ముసలాయన కూడా నిరూపించాడు. హర్యానాలో హస్నా రాణీగా గుర్తింపు పొందిన డ్యాన్సర్ అక్కడ మంచి పేరు ఉన్నది. ఆమె డ్యాన్స్ ఉన్నది అంటే పండగే పండగ. వేలాది మంది ఆమె డ్యాన్స్ చూసేందుకు తరలివస్తుంటారు. ఇలానే ఓ గ్రామంలో హస్నా రాణి డ్యాన్స్…
అతనో తహశీల్దార్..అయితేనేం డ్యాన్సర్ లకు ధీటుగా డ్యాన్స్ వేస్తూ అలరించారు. నూతన సంవత్సరం వేడుకల్లో రచ్చరంబోలా చేశారు. చిరంజీవి స్టెప్పులతో డ్యాన్స్ తో గోలీమార్ అంటూ అందరినీ అలరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన తాహశీల్దార్. ఖమ్మం జిల్లా కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్ లో డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా లోని…
ఈమధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కొందరు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆనందంగా డ్యాన్స్ లు వేస్తున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డప్పుతో దరువేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం అంపల్లి గ్రామంలో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి దరువేశారు. కళాకారులతో పాటు ఆయన కూడా డప్పుతో చిందులేసి సందడి చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేకలు…
ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి.. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్‌లు వేవారు తహసీల్దార్ హమీద్.. బుల్లెట్టు మీదొచ్చె…
పెళ్లైన కొత్త జంట డ్యాన్స్ చేయడం ఇప్పుడు షరా మామూలే అయింది. పెళ్లికి ముందు సంగీత్, పెళ్లి తరువాత రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తుంటారు. ఇలానే ఓ జంట వివాహం చేసుకున్నాక సరదాగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. అలా స్టెప్స్ వేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి వారి దగ్గరకు వచ్చింది. వరుడు రెండు కాళ్ల మధ్యలోకి దూరి అక్కడి నుంచి వధూవరుల మధ్యలోకి వచ్చి నిలబడింది. మీరు చేస్తున్న డ్యాన్స్ నాకు నచ్చడం లేదు అన్నట్టుగా ఫేస్…
ఎంత పని ఒత్తిడినైనా నచ్చిన విధంగా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా చేయవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయవచ్చు. కొంతమంది ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటారు. కొంతమంది పనిచేసే సమయంలో కూడా డ్యాన్స్ చేస్తూ పని చేస్తుంటారు. అలాంటప్పుడు చేస్తున్న పనిలో ఎలాంటి అలసట కనిపించదు. దక్షిణ కొరియాలోని ఓ కేఫ్‌లో పనిచేసే మహిళ కేఫ్ ప్లోర్‌ను తుడుస్తూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అలా డ్యాన్స్ చేస్తుండగా డోర్ ఒపెన్ చేసుకొని ఓ వ్యక్తి లోనికి వచ్చాడు.…