పెళ్లైన కొత్త జంట డ్యాన్స్ చేయడం ఇప్పుడు షరా మామూలే అయింది. పెళ్లికి ముందు సంగీత్, పెళ్లి తరువాత రిసెప్షన్‌లో డ్యాన్స్ చేస్తుంటారు. ఇలానే ఓ జంట వివాహం చేసుకున్నాక సరదాగా స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. అలా స్టెప్స్ వేస్తున్న సమయంలో అనుకోకుండా ఓ అతిధి వారి దగ్గరకు వచ్చింది. వరుడు రెండు కాళ్ల మధ్యలోకి దూరి అక్కడి నుంచి వధూవరుల మధ్యలోకి వచ్చి నిలబడింది. మీరు చేస్తున్న డ్యాన్స్ నాకు నచ్చడం లేదు అన్నట్టుగా ఫేస్ పెట్టి కూర్చుండిపోయింది.
Read: అదానీ చేతికి మరో అతిపెద్ద ప్రాజెక్ట్…
పాపం ఆ అతిధి ఇబ్బందిని గమనించి వధూవరులు నవ్వుకున్నారు. ఇంతకీ అ అతిథి ఎవరు అంటే వారు పెంచుకునే కుక్క. వారిపై ఉన్న చనువుతో కాళ్ల సందుల్లోకి దూరి డ్యాన్స్ పై నిరసన తెలిపింది. వధూవరుల డ్యాన్స్ ఎలా ఉన్నా, శునకం చేసిన పనితో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి…