ఆంధ్రప్రదేశ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి.. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు.. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో డీసీఎంసీ చైర్మన్ చలపతి ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, నాయకులు హాజరయ్యారు.. ఇక, బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కూడా వచ్చేశారు.. నిర్వహకుల కోరికతో రంగ ప్రవేశం చేశారు.. అమ్మాయిలతో కలిసి రెచ్చిపోయి డ్యాన్స్‌లు వేవారు తహసీల్దార్ హమీద్.. బుల్లెట్టు మీదొచ్చె బుల్‌రెడ్డి సహా మరికొన్ని పాటలకు అమ్మాయితో కలిసి డ్యాన్స్‌లు వేశారు. అయితే, ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాకు ఎక్కి రచ్చచేస్తున్నాయి… ఉన్నతాధికారులుగా ఉంటూ కరోనా నిబంధనలు పాటించకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడం ఏంటి? ఇలా రెచ్చిపోయి డ్యాన్స్‌లు ఏంటి ? అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.
Read Also: రిలయన్స్ మరో కీలక నిర్ణయం.. తక్కువ ధరకే బ్యాటరీలు..!