Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aakasam Lo Oka Tara: మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి ప్రేక్షకులు ఆయనను ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. మరోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, మన తెలుగు హీరోలాగే మారిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్.. దుల్కర్ సల్మాన్ కోసం బరిలోకి దిగుతున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రేజీ అప్డేట్ను పంచుకుంటూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. “ఆకాశంలో ఎన్నో తారలు ఉంటాయి.. కానీ ఐకాన్ స్టార్ ఒక్కరే” అంటూ పవర్ఫుల్ క్యాప్షన్‌తో ఈ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగులో తిరుగులేని మార్కెట్ ఏర్పరచుకున్న దుల్కర్, ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్నారు. విడుదల తేదీకి సరిగ్గా ఐదు రోజుల ముందు జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద బూస్ట్‌గా మారిందని అంటున్నారు.
Also Read
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
- Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
- Dil Raju : 'వారణాసి' రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
- Dil Raju: 'టాక్సిక్' నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
Aakasam lo yenno Thaara lu…but there is only ONE ICON STAR. 🌟❤️🔥
#ALLUARJUN garu Gracing The Pre Release Event of #AakasamLoOkaTara ✨️
SKY IS NOT THE LIMIT.📍JRC Convention, Hyderabad
15th Nov, 5 PM Onwards#AOTMovie In Cinemas from November 20th
@alluarjun https://t.co/2eFaHAQs3n
— Swapna Cinema (@SwapnaCinema) November 13, 2026
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?