కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై భీమ్’. మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా విశేష ఆదరణను దక్కించుకుంటోంది. ప్రేక్షకులు, విమర్శకులతో పాటు తమిళనాడు సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐఎండిబిలో ఈ చిత్రం…