S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Pema Khandu: టిబెటన్ బౌద్ధ మతగురువు దలైలామా తరుపరి వారసుడి గురించి చర్చ నడుస్తోంది. ఈ అంశం భారత్, చైనా మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా చైనా సార్వభౌమత్వం , చట్టాలకు అనుగుణంగా ఉంటాడని చైనా చెప్పింది. అయితే, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. తదుపరి దలైలామా వారసుడిని, దలైలామా మాత్రమే నిర్ణయించే హక్కు ఉందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై, ఈ విషయంలో భారత్ దూరంగా ఉండాలని చైనా కోరింది.
Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.
Dalai Lama 89th Birthday: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.
చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒక అబ్బాయిని ముద్దుపెట్టుకుంటూ, తన నాలుకను నోటితో తాకాలని బాలుడిని కోరిన వీడియో అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, సోమవారం లడఖ్ లో స్థానికలు దలైలామాకు మద్దతునిచ్చేందుకు శాంతి మార్చ్‌ను చేపట్టారు.
తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని బౌద్ధ మత గురువు దలైలామా కోరడం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దలైలామా క్షమాపణలు చెప్పారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు బాలుడికి, అతని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు.
Dalailama : టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా మైనర్ బాలుడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ వస్ర్ర్తాలు ధరించి బుద్ధుడి బోధనలు చేసే పెద్దాయనకు ఏమైందని జనం అవాక్కవుతున్నారు.
Khalkha Jetsun Dhampa Rinpoche: 8 ఏళ్ల పిల్లాడిని చూసి చైనా భయపడుతోంది. ఈ ఎనిమిదేళ్ల బాలుడు టిబెట్ ను చైనా నుంచి వేరు చేస్తాడా అనే కలవరం మొదలైంది. మార్చి 8న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో ప్రముఖ బౌద్ధగురువు దలైలామా, ఎనిమిదేళ్ల బాలుడికి దీక్షను ఇచ్చారు. ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఈ పిల్లవాడి ఫోటో ప్రపంచం వ్యాప్తంగా వైరల్ గా మారింది.