Dalailama : టిబెట్ బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా మైనర్ బాలుడి పెదవులపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాషాయ వస్ర్ర్తాలు ధరించి బుద్ధుడి బోధనలు చేసే పెద్దాయనకు ఏమైందని జనం అవాక్కవుతున్నారు. ‘‘ఈ వయసులో ఈ చేష్టలేమిటి? మతిగాని పోయిందా? వేరే దేశంలో అయితే కేసుపెట్టి జైల్లో పడేస్తారు..’’ అని జనం మండిపడుతున్నారు. దలైలామా ఇటీవల మన దేశంలోనే జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఓ బాలుణ్ని పిలిచి ముచ్చటించారు. మొదట ముద్దు పెట్టాడు. అంతటితో ఊరుకోకుడా నాలుకను పాములా బయటపెట్టి ‘‘నా నాలుక చప్పరించు’’ అని అన్నాడు. దీంతో పిల్లాడు ఠారెత్తిపోయాడు. ఇదంతా వీడియోల్లో రికార్డు కావడంతో లామాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: Sonal: అబ్బాయిలని ఇలా ఇబ్బంది పెట్టకూడదు తప్పు మేడమ్…
కోట్లాదిమంది బౌద్ధులతోపాటు ఇతర మతాల వారు కూడా గౌరవించే పెద్దమనిషికి ఈ చిన్నబుద్ధులు ఏమిటని మండిపడుతున్నారు. ఆయనపై పోక్సో చట్టం కిందకు కేసు పెడితే అలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారికి హెచ్చరికగా ఉంటుందంటున్నారు. అయితే దలైలామా కేవలం సరదా కోసమే అలా నాలుక చాచి చప్పరించమన్నారని, ఆయనలో ఎలాంటి దురుద్దేశాలూ లేవని మరికొందరు వెనకేసుకొస్తున్నారు. 2019లో కూడా దలైలామా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తదుపరి దలైలామా మహిళ అయితే ఆమె మరింత ఆకర్షణీయంగా ఉండాలని అన్నారు. 2019లో బ్రిటీష్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా దలైలామా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన ఆ తర్వాత తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
Utterly shocked to see this display by the #DalaiLama. In the past too, he’s had to apologize for his sexist comments. But saying – Now suck my tongue to a small boy is disgusting.
pic.twitter.com/z2qMGignHO— Sangita (@Sanginamby) April 9, 2023