తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ…
మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా…
మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా…
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు దగ్గుబాటి.. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్‌గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది.…
ఉప్పు..నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాల మధ్య రెండున్నర దశాబ్దాలుగా సఖ్యత లేదు. పేరుకు తోడల్లుళ్లు అయినా.. ఎవరి రాజకీయం వారిదే. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. ఇటీవలే ఆ ఇద్దరు ఓ కార్యక్రమంలో కలుసుకుని.. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే.. సంక్రాంతి పండక్కి చాలాఏళ్ల తర్వాత ఓ అక్క ఇంటికి తమ్ముడొచ్చాడు. ఆ తమ్ముడి సందడి సంక్రాంతికే పరిమితమా.. లేక ఇద్దరు బావలను కలపటం కోసమా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి…