CM Chandrababu: దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు!
- దగ్గుబాటి ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం
- ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు
- 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి తోడల్లుళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
‘దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు. 40 ఏళ్లు కలిసి ఉన్నాం కానీ.. ఆయన పుస్తకం రాయడం ఏంటని నాకు డౌట్ వచ్చింది. దగ్గుబాటి మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. దగ్గుబాటి ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వేంకటేశ్వర రావు రైటర్ కాని రైటర్. ఆయన డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయలేదు. మంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేశారు.. సినిమాలు తీశారు. యాక్తివ్ లైఫ్ నుంచి రిటైర్డ్ లైఫ్ కు వచ్చారు కదా.. ఎలా కాలక్షేపం అని అడిగాను. నాకూ అటువంటి పరిస్థితి రావచ్చని అడిగాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Also Read
వేంకటేశ్వర రావు రోజు వారీ షెడ్యూల్ గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు పేకాట ప్రస్తావన తెచ్చారు. ఇక పురంధేశ్వరి ఎన్నికలను నడిపించిన తీరు అభినందనీయం అని సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో తోడల్లుళ్లు వెంకటేశ్వర రావు, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 1978లో వెంకయ్య నాయుడు, తాను తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టామని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో పంచ్‌లు తగ్గలేదు సరికదా ఇప్పుడు పెరిగాయని సీఎం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!