Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Venkateswara Rao: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు దగ్గుబాటి.. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.. ఇక, వెంటనే ఆయనను సన్నిహితులు ఆలయం వద్ద కొద్దిసేపు సేద తీర్పించారు.. పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే ఆయన అస్వస్థకు గురయ్యారు.. అయితే, కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఆయన అక్కడే కూర్చిండిపోయారు.. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలోనూ అస్వస్థతకు గురయ్యారు.. గుండె నొప్పి రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం విదితమే.
Read Also: Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
మరోవైపు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఆ మధ్య బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు.. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు చెప్పుకొచ్చారు.. కాగా, స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి పెద్ద అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా సేవలు అందించారు.. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.. ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకోగా.. ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!