Minister Parthasarathy: మాజీ మంత్రి వర్యులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రేపు(ఆదివారం)మధ్యాహ్నం డీఎస్ స్వంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. డి. శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. డీఎస్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. తెల్లవారు జామున 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పని చేశారు. డి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు.
మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదే అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డి.ఎస్. కాంగ్రెస్ పార్టీలో చేరికపై వివాదం కొనసాగుతుంది. డీఎస్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత…
టీఆర్ఎస్‌ను వీడి.. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన DS.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పాకే కాంగ్రెస్ కండువా కప్పుకొంటారా? నైతికత కింద రాజీనామా చేస్తారా? ఇంకేదైనా వ్యూహం ఉందా? రాజకీయాల్లో చురుకైన పాత్ర కోసం చూస్తున్నారా? పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో.. కాంగ్రెస్‌లో డీ శ్రీనివాస్ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు సమ్మతి తీసేసుకున్నారు. అయితే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు.. ఆయన కుమారుడు ఒకరు బీజేపీ నుంచి ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తుండగా.. మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. టీఆర్ఎస్‌కు కూడా దూరమైన డీఎస్.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…