Mahesh kumar goud: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదే అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డి.ఎస్. కాంగ్రెస్ పార్టీలో చేరికపై వివాదం కొనసాగుతుంది. డీఎస్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. డీఎస్ రాజీనామాపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీ.ఎస్. కాంగ్రెస్ లో చేరడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దాయనగా పార్టీ లోకి వస్తే స్వాగతించామని, కొడుకుల మధ్య నలిగిపోతారని ఊహించలేదన్నారు. డీ.ఎస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ కి సంబంధం లేదని, గాంధీ భవన్ మాకు దేవాలయం ఎవరు వచ్చిన గాంధీ భవన్ లోనే చేర్చుకుంటామన్నారు. ఇద్దరు కొడుకులు మధ్య డీ.ఎస్ నలిగిపోతున్నారు, ఇద్దరి మధ్య ఆస్తి, రాజకీయ తగాదాలు ఉన్నాయని తెలిపారు. వారి ఒత్తిడి వల్లే డీ.ఎస్. రాజీనామా చేసినట్లు తెలుస్తోందన్నారు. కొడుకు రాజకీయ అవసరం కోసం డీ.ఎస్. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేనిదే డీ.ఎస్. లేరు, ఆయన కొడుకులు లేరని.. ఆ విషయాన్ని అర్వింద్ గుర్తించాలన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పై అర్వింద్ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. అర్వింద్ అనుభవించే అస్థి కాంగ్రెస్ పుణ్యమే అంటూ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Indo-Russian mega meet: ఇండియా-రష్యా మెగా మీటింగ్
మల్లికార్జున ఖర్గేకు డీఎస్ లేఖ..
కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ అన్నారు. అయితే.. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలని ఆయన స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారని, తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్నారు డీఎస్. తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డీఎస్ లేఖ రాశారు.
డీఎస్ కు కుమారుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
అయితే.. డీస్ రాజీనామా వ్యవహారంపై ఆయన కుమారుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి డీఎస్ పై కుట్ర జరుగుతోందని ఆయకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, డీఎస్ చుట్టూ ఉన్నవాళ్లపై అనుమానం ఉందన్నారు. అంతేకాకుండా.. డీఎస్ ను గదిలో బంధించి బలవంతంగా సంతకం చేయించారని, ఆస్తులు కూడా అలాగే రాయించుకున్నారని ఆరోపించారు. దీనిలో ఎంపీ అర్వింద్ హస్తం ఉందని, అర్వింద్ అంతు చూస్తానని హెచ్చరించారు. ఇక.. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారన్నారు. అయితే.. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్ అని సంచల వ్యాఖ్యలు చేశారు.
Gold prices: గోల్డెన్ ఛాన్స్ .. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే