ఏపీలో ఓ వైపు ఎండల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అయితే మరోవైపు భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కూడా పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో సోమవారం నాడు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం, విజయనగరం జిల్లాలోని…
ఫిలిప్పీన్స్ దేశాన్ని రాయ్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. తుఫాన్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 375కి చేరింది. ఇప్పటికే తుఫాన్ సృష్టించిన విలయానికి వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈ తుఫాన్ ధాటికి విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడంతో ఫిలిప్పీన్స్‌లో అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 8 లక్షల మందిపై రాయ్ తుఫాన్ ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. Read Also: ఆ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం…
ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి… తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని అంటున్నారు వాతావరణ…