Money Laundering Scam: రోజురోజుకు సమాజంలో ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు అన్ని విధాల ఈ ఆర్ధిక నేరాలకు సంబంధించి అలర్ట్ చేస్తున్న ప్రజలు మాత్రం సైబర్ నేరాల ఉచ్చులో నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దోపిడీ విషయం బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. బాధితుడు హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో నివసిస్తున్న 79 ఏళ్ల వ్యక్తి CBI ముసుగులో దోపిడీ స్కామ్‌కు గురయ్యాడు. జూలై 6, 2025న బాధితుడికి CBI…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్లైన్లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.…
ప్రస్తుతం ‘సైబర్ నేరగాళ్లు’ ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ…
Hacking: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారింది. బ్యాంకింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఫొటోలు, పర్సనల్ డేటా.. అన్నింటికీ ఈ చిన్న డివైస్ ఆధారంగా మారింది. అయితే, టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హ్యాకర్లు సరికొత్త మార్గాలను ఉపయోగించి ఫోన్లోని డేటాను చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఒక నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం, అపరిచితమైన యాప్‌కు అనుమతి ఇవ్వడం వంటి చిన్న అజాగ్రత్తలతోనే ఫోన్ పూర్తిగా…
Fake Student: ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కొమురం భీం జిల్లాలో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టైంది. అదృశ్యమైన యువతి ఆధార్ కార్డు ఏడాది తర్వాత ఇంటికి రావడంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు కూపీలాగారు. ఆ యువతి విషయం వెలుగులోకి రావడంతోనే మరో యువతి ని సైతం విక్రయించినట్లు తేలింది. 9 మంది ఓ ముఠాగా ఏర్పడి యువతులు, ఒంటరి మహిళలే టార్గెట్‌గా అక్రమ రవాణాకు తెరలేపారు. ఆధార్ కార్డు కాస్త క్లూ ఇవ్వడంతో మొత్తం కేసును లాగారు పోలీసులు. ఇద్దరినే అమ్మేశారా?…
చైల్డ్ పోర్నోగ్రఫీపై నిఘా సంస్థలు దృష్టిసారించాయి. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆ అమెరికా సంస్థకు తెలిసిపోతుంది. ఇందుకోసం అమెరికా కేంద్రంగా నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్.. నెక్‌మెక్ పని చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెక్యూరిటీ ఏజెన్సీలతో సమాచారం పంచుకుంటోంది. అమెరికా సైబర్ టిప్ లైన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణలో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒంటరిగా ఉన్నాం.. చేతిలో మొబైల్ ఉంది.…
ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.