సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఒక చిన్న కాల్‌తో అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్కు కాల్ చేసి ఏకంగా 93 లక్షలు కొట్టేశారు. ఆమె ఖాతా నుంచి 10 సార్లు డబ్బు డ్రా చేసుకున్నారు కేటుగాళ్లు. అంతా అయిపోయాక మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. డిజిటల్ అరెస్ట్.. సైబర్ క్రిమినల్స్‌కు ఇదో ఆయుధం. అమాయకులు, చదువు రాని వారు దొరికితే చాలు.. సైబర్ కేటుగాళ్లు ఈ…
Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ మోసం బయటపెట్టారు. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టు విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో, శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి, వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది.…
సైబర్ క్రిమినల్స్ రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్నారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా అమీర్ పేటకు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ కాల్ ద్వారా హనీ ట్రాప్ చేసి అందిన కాడికి దోచుకున్నారు సైబర్ చీటర్స్. అమీర్ పెట్ కు చెందిన వృద్ధుడికి జూన్ మొదటి వారం నుంచి మాయ రాజ్ పుత్ అనే మహిళ పేరుతో కాల్స్, మెసేజెస్ చేశారు స్కామర్స్. చనువుగా మాట్లాడుతూ వృద్ధుడిని హనీ…
Honey Trap: హైదరాబాద్‌లో మరోసారి ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్‌లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్…
Fake Facebook Account in Telangana BJP: తెలంగాణ బీజేపీ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ జోన్, సైబర్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాలో అభ్యంతరకరమైన, తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తున్నారని.. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులలో గందరగోళం, విభేదాలకు కారణమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Money Laundering Scam: రోజురోజుకు సమాజంలో ఆర్ధిక నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అధికారులు అన్ని విధాల ఈ ఆర్ధిక నేరాలకు సంబంధించి అలర్ట్ చేస్తున్న ప్రజలు మాత్రం సైబర్ నేరాల ఉచ్చులో నుంచి బయటకి రాలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ దోపిడీ విషయం బయటికి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. బాధితుడు హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో నివసిస్తున్న 79 ఏళ్ల వ్యక్తి CBI ముసుగులో దోపిడీ స్కామ్‌కు గురయ్యాడు. జూలై 6, 2025న బాధితుడికి CBI…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. కానీ.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇట్టే పట్టేసుకున్నారు. వాస్తవానికి.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శిర్డీ హిల్స్‌లో చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో దొంగతనం చేసినవారు ఎవరూ కాదండీ.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్లైన్లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది.…
ప్రస్తుతం ‘సైబర్ నేరగాళ్లు’ ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ…