Cyber Fraud : 70 ఏళ్ల ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి అనగానే.. జీవితంలో చాలా అనుభవాలున్న పెద్దమనిషి అనిపించాలి కదా.. కానీ డిజిటల్ మోసాలకి వయస్సు అడ్డుకాదన్నట్టు, ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో అతని విశ్రాంత జీవితం తలకిందులైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ రిటైర్డ్ ఉద్యోగికి ఓ యువతి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను పేద కుటుంబానికి చెందినవని చెప్పి వైఫై కనెక్షన్ కోసం రూ.10,000 సహాయం అడిగింది. మానవత్వంతో స్పందించిన బాధితుడు డబ్బులు పంపించడంతో…
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది.…
Cyber Den: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ…
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టు రట్టయింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తూ.. నెలకి 15-20 కోట్ల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్…
Shocking: దేశ ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా విలసిల్లుతున్న బెంగళూరులో నిత్యం లక్షలాది మంది ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మెట్రో ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న తరుణంలో, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన నగర ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అదే, “బెంగళూరు మెట్రో చిక్స్” అనే ఇన్ స్టాగ్రామ్ పేజీ వ్యవహారం. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో బోగీల్లో మహిళలు, అమ్మాయిలు ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రమేయం లేకుండా,…
Atchutapuram: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సమయంలో భారీ సైబర్ డెన్…
Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.…
Cyber Fraud : హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. చీఫ్ మినిస్టర్ ఓఎస్డీ (ప్రత్యేక అధికారి) పేరుతో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వల విసురుతున్నారు. ఈ నేరాలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. సీఎం కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్…
పంజాబ్‌లోని బటిండా జిల్లా నుంచి ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాలి బ్లాక్‌మెయిలింగ్‌తో బాధపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 32 ఏళ్ల రాహుల్ కుమార్ సంగువానా బస్తీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు వదిలాడు. అందులో తన ప్రేయసిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. 'ఆమె నన్ను చంపుతుంది!' అని రాసుకొచ్చినట్లు సమాచారం.
సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్టెల్ వినియోగదారులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడనుంది.