Devi Sri Prasad: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందు సంఘాలు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేసింది. ఇటీవల దేవిశ్రీ ఓ పారి అనే ఆల్బమ్ ను ఆలపించడమే కాకుండా అందులో నటించాడు కూడా.. ఇక ఆ సాంగ్ కొద్దిగా ఐటెం సాంగ్ లా ఉందని. అలాంటి సాంగ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని దేవిశ్రీ జొప్పించాడని కరాటే కళ్యాణి మండిపడింది.
పవిత్రమైన హరే రామ హరే కృష మంత్రం పై అశ్లీల దుస్తులు, నృత్యాలతో పాటను చిత్రీకరించిన దేవిశ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. ఆమెతో పాటు దేవిశ్రీ పై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఒక హిందువుగా పుట్టి ఆ మంత్రాలను ఎలా ఆలపించారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కళ్యాణితో పాటు హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. ఇకపోతే ప్రస్తుతం దేవిశ్రీ వరుస సినిమాలతో మారిన విషయం విదితమే. మరి ఈ వివాదంపై దేవిశ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.